Bawal Trailer | బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor), వరుణ్ ధవన్ (Varun Dhawan) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం బవాల్ (Bawaal). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న అజ్జు (వరుణ్ ధవన్) జీవితంలోకి నిషా (జాన్వీకపూర్)అనే యువతి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కాస్తా వైవాహిక బంధం వరకు వెళ్తుంది. ఆ తర్వాత భార్యను యూరప్ ట్రిప్‌కు తీసుకెళ్తాడు హీరో. యూరప్ ట్రిప్‌లో జాన్వీకపూర్, వరుణ్ ధావన్ మధ్య ఎలాంటి వార్ జరిగిందనే నేపథ్యంలో సాగునున్నట్టు ట్రైలర్ ద్వారా చెప్పేశాడు డైరెక్టర్. వరల్డ్ వార్ ట్విస్ట్‌తో సాగుతున్న జాన్వీ, వరుణ్ ట్రాక్ ఎలా ఉండబోతుందనేది సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్.
దంగల్,చిఛోరే సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నితేశ్ తివారి దర్శకత్వంలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో మనోజ్ పహ్వా, ముఖేశ్ తివారి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఎర్త్స్కై పిక్చర్స్‌పై తెరకెక్కిస్తున్నారు. జులై 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.
బవాల్ ట్రైలర్..
pyaar se bawaal tak ka ek safar! 💙
produced by #SajidNadiadwala and directed by @niteshtiwari22#BawaalOnPrime, July 21
trailer out now@Varun_dvn #JanhviKapoor @ashwinyiyer @WardaNadiadwala @NGEMovies @earthskynotes #PiyushGupta #ShreyasJain #NikhilMehrotra @TSeries pic.twitter.com/IIgNRAIKoh— prime video IN (@PrimeVideoIN) July 9, 2023