Bhediya Movie Telugu Trailer | ప్రస్తుతం హిందీ హీరోలు టాలీవుడ్లో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఒకప్పుడు హిందీలో మాత్రమే రిలీజైయ్యే సినిమాలు ఈ మధ్య తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ మధ్యలో ‘క్రిష్’ సిరీస్, ‘ధూమ్-3’, ‘డర్టీ పిక్చర్’ వంటి పలు సినిమాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. కానీ ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు కేవలం హిందీ భాషకే పరిమితం అయ్యాయి. ఇక మళ్లీ ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు తెలుగులో రిలీజవుతూ ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్‌పై కన్నేశారు. ఇటీవలే రణ్‌బీర్ నటించిన బ్రహ్మాస్త్ర తెలుగులో రిలీజై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వరుణ్ ధావన్ కూడా తన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం వరుణ్ నటించిన ‘భేదాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అయితే కేవలం హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా ట్రయిలర్‌ను రిలీజ్ చేశారు. తోడేలు కరవడంతో వరుణ్ తోడేలులాగా అయిపోతాడు. తోడేలులా మారిన తర్వాత వరుణ్ జీవితం ఎలా మారింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది. అయితే తోడేలులా వరుణ్ కేవలం రాత్రి పూట మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తుంది కామెడీ హార్రర్నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ దర్శకత్వం వహించాడు. కృతిసనన్ హీరోయిన్గా నటించింది. మడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా దినేష్ విజన్.. హార్రర్ కామెడీ యూనివర్స్‌లో మూడో ఇన్స్టాల్మెంట్గా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో ఈ యూనివర్స్‌లో తెరకెక్కిన ‘స్త్రీ’, ‘రూహీ’ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.
Read Also:
ఓం రౌత్‌కు ‘ఆదిపురుష్’ నిర్మాత 4కోట్ల కారు గిఫ్ట్.. ఇందులో నిజమెంత?
Swathi Mutyam | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘స్వాతిముత్యం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!