యువ నాయిక వర్ష బొల్లమ్మ పెళ్లి వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ బడా నిర్మాత కుమారుడిని ఆమె పెళ్లాడబోతున్నదంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది వర్ష బొల్లమ్మ. తనకు తెలియకుండానే పెళ్లి సంబంధం కుదిర్చి..అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థాంక్యూ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు చెబితే నేను కూడా మా ఇంట్లో వాళ్లకి చెప్పేస్తా. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఓటీటీలో నేను నటించిన ‘స్వాతిముత్యం’ సినిమా చూడండి’ అని ట్విట్టర్లో పేర్కొంది. ఈ పోస్ట్‌కు ‘ఫేక్‌న్యూస్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఈ ట్వీట్‌తో వర్ష బొల్లమ్మ తన పెళ్లి వార్తలకు చెక్ పెట్టిందని అంటున్నారు. ఆమె కథానాయికగా నటించిన ‘స్వాతిముత్యం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.