Varasudu Movie | విజయ్ మాస్ స్టెప్స్‌తో.. ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్..!
Varasudu Movie First Single | ఎప్పుడెప్పుడా అని విజయ్ థలపతి అభిమానులు ఎదురు చూస్తున్న 'వారిసు' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'రంజితమే' అంటూ సాగే మాస్‌బీట్ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది.
Varasudu Movie First Single | ఎప్పుడెప్పుడా అని విజయ్ థలపతి అభిమానులు ఎదురు చూస్తున్న ‘వారిసు’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘రంజితమే’ అంటూ సాగే మాస్‌బీట్ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ‘వారిసు’ పేరుతో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తుంది.
ఈ క్రమంలోనే ‘రంజితమే’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో విజయ్ మాస్స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వివేక్ లిరిక్స్ అందించిన ఈ పాటను సింగర్ మానసితో కలిసి విజయ్ థలపతి ఆలపించాడు. థమన్ మరోసారి తన స్టైల్ ట్యూన్‌తో శ్రోతలను ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. విజయ్‌కు జోడీగా రష్మిక హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
PS-2 | ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Kantara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంతార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Prabhas | మరో బాలీవుడ్ దర్శకుడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్..!
మరోసారి ఆ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

