Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం “వారణాసి” మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయి బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరవేయాలనే లక్ష్యంతో రాజమౌళి ప్రతి ప్రమోషన్‌ను అత్యున్నత స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వెలుగుచూసిన కొన్ని ఫోటోలు భారీ హంగామా సృష్టించాయి. లాస్ వెగాస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ స్పియర్ బాల్‌పై “వారణాసి” గ్లింప్స్ ప్రదర్శించారన్న న్యూస్ విపరీతంగా వైరల్ అయింది.
స్పియర్ బాల్‌పై మహేష్ బాబు విజువల్స్ తిరుగుతున్నట్లు కనిపించే ఆ ఫోటోలు నెట్టింట్లో వేగంగా స్ప్రెడ్ కావడంతో అందరు నిజమేనని నమ్మారు. కాని వాస్తవానికి అవి అసలు నిజం కావని తర్వాత తేలింది. ఆ ఫుటేజ్, ఫోటోలు అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినవి మాత్రమే అని పరిశీలనలో బయటపడింది. దీంతో చాలామంది అభిమానులు, నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్పియర్ బాల్‌పై ప్రమోషన్ చేయడం అసాధ్యమేమి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండ్లు, సినిమాలు అక్కడ తమ కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న దృష్ట్యా, సరైన మొత్తాన్ని చెల్లిస్తే “వారణాసి” టీమ్ కూడా భవిష్యత్తులో అలాంటి గ్లోబల్ ప్రమోషన్ చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే వారణాసికి సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట వైరల్‌గా మారింది.చిత్రంలో మహేష్ ఏకంగా ఐదు అవతారాల్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సినిమాలో చాలా యుగాలు చూపించబోతున్న నేపథ్యంలో యుగానికి ఓ అవతారంలో మహేష్ కనిపిస్తాడా అని ముచ్చటించుకుంటున్నారు. గెటప్స్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . రాజమౌళి అయితే వీటిని ఇప్పట్లో రివీల్ చేసే అవకాశం అసలు లేదు. వారణాసిలో మహేష్ రెండు లుక్స్ లో కనిపించబోతున్నారనే క్లారిటీ ఇప్పటికే ఉంది. రుద్ర అనే పాత్రతో పాటు రాముడిగా కనిపించి మహేష్ అలరించనున్నాడు.