పాట కోసం భాగ్యనగరంలో భారీ సెట్
తన గత చిత్రాలకు భిన్నంగా శరవేగంగా ‘వారణాసి’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది. వచ్చే నెల తొలివారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.
తన గత చిత్రాలకు భిన్నంగా శరవేగంగా ‘వారణాసి’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది. వచ్చే నెల తొలివారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాలపై ఓ పాటను ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ పాట కోసం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఓ భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని వినికిడి. భారతీయ పురాణ, ఇతిహాసాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో, అడ్వెంచర్లకు కొదవ ఉండదని, ట్రజర్ హంట్ కూడా ఈ కథలో కీలకమైన భాగమని ఇన్సైడ్ టాక్.
ఈ సినిమాలోని కొంతభాగం మహేశ్ శ్రీరామచంద్రుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్‌ని కూడా రాజమౌళి పూర్తి చేశారు. 1300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పాన్‌వరల్డ్ గ్లోబల్ అడ్వెంచర్‌ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రతినాయకునిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, మాటలు: దేవకట్టా, కెమెరా: పీఎస్ వినోద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: కె.ఎల్.నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

