vani bhojan| చియాన్ విక్రమ్, ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహాన్. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కథ పాతదే అయినా కార్తిక్ సుబ్బరాజు టేకింగ్, తండ్రీ కొడుకులు పోటీపడుతూ నటించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ కొంచం స్లోగా అనిపించినా సెకండ్ ఆఫ్ నుంచి సినిమా హై స్పీడ్‌ను అందుకుంది. లలిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ తీసేశారని టాక్.
వాణీ భోజన్ ఈ చిత్రంలో మరో కథానాయికగా నటించిందని, ఈ సినిమా షూటింగ్లలో కూడా ఈమె పాల్గొందని టాక్. కారణం తెలియదు కానీ ఈమె నటించిన సీన్లన్నీ తీసేశారని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. గతంలో మహాన్ చిత్ర పోస్టర్‌ను వాణీభోజన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఇప్పటికీ ఆ పోస్ట్‌ను డిలీట్ చేయలేదు.ఇక తెలుగులో ఈమె విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో తరుణ్ భాస్కర్‌కు జోడిగా నటించింది.