Valimai | బ్రేక్‌ఈవెన్‌ను సాధించలేకపోయిన అజిత్.. ‘వలిమై’ ఫైనల్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'వలిమై'. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మికొండ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
Valimai Collections | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మికొండ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మొదటి నుంచి సినిమాపై మంచి బజ్ ఉంది. ఇక కార్తీకేయ విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపైన భారీగా అంచనాలు ఎర్పడ్డాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24న తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కానీ పోటీగా భీమ్లానాయక్ సినిమా ఉండటంతో ఈ చిత్ర కలెక్షన్లకు తీవ్ర దెబ్బపడింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫైనల్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
నైజాం : 0.60 కోట్లు
సీడెడ్ : 0.31 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.32 కోట్లు
ఈస్ట్ : 0.25 కోట్లు
వెస్ట్ : 0.19 కోట్లు
గంటూరు : 0.23 కోట్లు
కృష్ణ : 0.21 కోట్లు
నెల్లూరు : 0.15 కోట్లు
ఏపీ+తెలంగాణ : 2.26 కోట్లు
‘వలిమై’ చిత్రానికి తెలుగులో 2.4 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ఈవెన్కు 2.5 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 2.26 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు 14లక్షలను నష్టపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

