VaitlaMacho | యాక్షన్ ఎంటర్టైనర్ లోడింగ్ గురూ.. గోపీచంద్-శ్రీను వైట్ల నయా అప్డేట్
VaitlaMacho | తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇటలీలో కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. తనదైన శైలి వినోదం, మాస్ యాక్షన్ అంశాలతో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
VaitlaMacho | తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇటలీలో కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. తనదైన శైలి వినోదం, మాస్ యాక్షన్ అంశాలతో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే నేడు ఉగాది పండుగ సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన చిత్రబృందం ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్‌ను ఏప్రిల్ 11న రంజాన్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు శ్రీనువైట్లకు రెండక్షరాల టైటిల్స్ సెంటిమెంట్ కావడంతో ఇదే టైటిల్‌ను ఖరారు చేయొచ్చని అంటున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండెపూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
#VaitlaMacho first strike on April 11th#Gopichand #SrinuVaitla pic.twitter.com/3YtyRe6s6Q
— Television & Tollywood Updates (@TTUpdates360) April 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

