Baby Movie | పదహారేళ్ల నుంచి పాతికేళ్ల పైబడిన ప్రతీ కుర్రాడు ప్రస్తుతం వైష్ణవి మాయలో పడిపోయారు. ఇన్‌స్టా రీల్స్ నుంచి యూట్యూబర్‌గా.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌తో మెప్పించిన వైష్ణవి ఇప్పుడు బేబీతో హీరోయిన్గా మారింది. వారం కిందట రిలీజైన బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైష్ణవి పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వైష్ణవి క్యారెక్టర్‌ను బండ బూతులు తిడుతున్నారు. అంటే నెగెటీవ్ క్యారెక్టర్లో వైష్ణవి ఏ లెవల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
డెబ్యూ సినిమాలోనే అన్నన్ని వేరేయేషన్లు చూపించడం మాములు విషయం కాదు. ఒక తెలుగు హీరోయిన్‌కు తొలి సినిమాతోనే ఈ రేంజ్ గుర్తింపు రావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ది బెస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్స్లలో వైష్ణవి చైతన్య నటన ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. బేబీ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెకే ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా తన పాత్రలో జీవించేసింది. ఈ సినిమాతో వైష్ణవి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పలు పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థల నుంచి వైష్ణవికి ఆఫర్స్ వస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇక ఇదంతా ఇలా ఉంటే వైష్ణవి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందట. అదేంటంటే.. మూడు నెలల ముందు చిన్న సినిమాగా రిలీజై కోట్లు కొల్లగొట్టిన బలగం సినిమా. ఈ సినిమాలో కావ్య రోల్‌ను ముందుగా దర్శకుడు వేణు, వైష్ణవికి ఆఫర్ చేశాడట. కానీ వైష్ణవి పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయిందట. అలా వైష్ణవి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుంది. అయితే ఆ సినిమా చేసుంటే మట్టుకు వైష్ణవికి ఇంత గుర్తింపు మాత్రం ఖచ్చితంగా వచ్చుండేది కాదు.