Vaishnavi Chaitanya| కొద్ది నెలల క్రితం తెలుగులో వచ్చిన సూపర్ హిట్ చిత్రం బేబి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు టిక్ టాక్ లతో ఫేమస్ అయ్యిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్‌ని అందుకొని శభాష్ అనిపించుకుంది. అయితే టాలీవుడ్ లో మొత్తానికి ఒక తెలుగు అమ్మాయికి మంచి గుర్తింపు వచ్చింది అని మిగతా హీరోయిన్స్ కూడా భావించారు.కాని కొద్ది రోజుల తర్వాత బేబి మూవీ నిర్మాత తమకి కావాల్సిన హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తామని మన తెలుగు అమ్మాయి అనుకొని ఒకామెకి అవకాశం ఇస్తే ఆమె ఏం చేసిందో మాకు తెలుసు అన్నట్టుగా ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఎస్కేఎన్ కామెంట్స్ వైష్ణవిని ఉద్దేశించే చేసిందని అందరు అనుకున్నారు. కాని ఆ మరుసటి రోజే ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానంటూ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. దాంతో ఆ వివాదం చల్లబడింది. అయితే తాజాగా ఇదే విషయంపై వైష్ణవి చైతన్యకు సైతం ప్రశ్న ఎదురైంది. తనకి తన బేబి నిర్మాత ఎస్ కే ఎన్ తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చింది. ఆయన ఆరోజున అలా మాట్లాడిన తర్వాత ఓ వీడియో కూడా వదిలారు. అందులో కూడా తననే అన్నట్టు అసలు ఎక్కడా లేదు కదా అని తెలిపింది.
అసలు తనని ఏమీ అనని విషయానికి నేనెందుకు రెస్పాండ్ అవుతాను అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్న కూడా ఉంది.బేబి హిట్ తర్వాత అదే ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్యతో మరో రొమాంటిక్ సినిమాఉంటుందని అనౌన్స్ చేశారు. కాని ఎందుకో ఆగిపోయింది.అయితే ఈ మూవీ ఫ్యూచర్లో సెట్ అవ్వొచ్చేమో అన్నట్టుగా రిప్లై ఇచ్చింది.అంటే వైష్ణవి చైతన్యకి నిర్మాతతో ఎలాంటి ఇబ్బందులు లేవని అర్ధమవుతుంది.