Baby | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది బేబి (Baby). హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా నటించారు. బేబి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఈ విజయవాడ భామ యాక్టింగ్ కు మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. కెరీర్లో తొలినాళ్లలోనే తన యాక్టింగ్‌తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని ఫిదా చేసింది. లీడ్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న వైష్ణవి చైతన్యను సహజనటి జయసుధతో పోలుస్తూ.. ప్రశంసల జల్లు కురిపించాడు చిరంజీవి.
బేబి సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం ఓ లవ్‌స్టోరీ మాత్రమే కాదు..సాధారణంగా లవ్ స్టోరీల్లో ఎమోషన్స్ ఉంటాయి. పెద్దలు వ్యతిరేకిస్తుంటారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. ఎంతో కొంత నెగెటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అన్నీ పాత్రలు మంచివే. విలన్ లేకుండా సినిమా చేశారు. కానీ ఇందులో విలన్ ఎవరో కాదు.. మన మానసిక సంఘర్షణ. వైష్ణవి చైతన్య పడ్డ మానసిక సంఘర్షణ ఈ సినిమాను ఆద్యంతం నిలబెట్టింది. అది చాలా సహజంగా ఉంది. వైష్ణవి చైతన్య ఒక బస్తీ అమ్మాయిలా ఉంది. అలాంటి అమ్మాయి గ్లామరస్‌గా మేకోవర్ అయ్యింది. మేకోవర్‌లో కానీ, పర్ఫార్మెన్స్లో తన ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కానీ చాలా పరిణతి కలిగిన అమ్మాయిలా నటించింది.
గ్లామరస్ పాత్రల్లోనూ, డీగ్లామరైజ్డ్ పాత్రల్లో అత్యద్భుతంగా జీవించే నటి జయసుధ. ఇప్పటివరకు అలాంటి నటి ఎవరైనా వచ్చారా.. అంటే ఇంతవరకు నాకు తారసపడలేదు. వైష్ణవి చైతన్యను చూస్తే ఆ లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయి. నాకు తన భవిష్యత్ కనబడుతోంది. గ్లామరస్గాను, డీగ్లామరస్గాను అంత సహజంగా చేసింది. నటిగా ఆమెకు అంత భవిష్యత్ ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు చిరు.
బేబి ట్రైలర్..
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో