తొలిచిత్రం ‘ఉప్పెన’తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్‌తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం ఆయనకు నిరాశే మిగిల్చాయి. ‘ఆదికేశవ’ (2023) తర్వాత ఆయన మరే సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
పక్కా కమర్షియల్ అంశాలతో పరశురామ్ తయారు చేసిన స్క్రిప్ట్.. వైష్ణవ్‌తేజ్‌ను ఇంప్రెస్ చేసిందని, ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీస్టార్’ తర్వాత దర్శకుడు పరశురామ్ రెండేళ్ల గ్యాప్ తీసుకొని తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు.