పవన్ కల్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు ఆయన మేనళ్లుల్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. నటులుగా పవన్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వారు తరచూ చెబుతుంటారు. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నామనీ అంటారు. వారు కోరుకున్న అవకాశాలు పవన్ వరుసగా సినిమాలు చేస్తుండటంతో దక్కుతున్నాయి. ‘వినోదయ సితమ్’ సినిమాలో ఇప్పటికే పవన్‌తో కలిసి నటించే అవకాశం సాయిధరమ్ తేజ్ దక్కించుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇక తాజాగా ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ పవన్ కొత్త సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్‌తో దర్శకుడు సుధీర్ వర్మ ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు వైష్ణవ్‌తేజ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉ న్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.