వందకోట్ల ఇల్లు ఎందుకంటే..?
ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఇటీవల మధురైలో నిర్మించుకున్న విలాసవంతమైన గృహం గురించి దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఇటీవల మధురైలో నిర్మించుకున్న విలాసవంతమైన గృహం గురించి దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఈ ఇంటి విలువ దాదాపు వందకోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భారీ ఇంటి నిర్మాణం వెనకున్న ఉద్దేశ్యం గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ‘మా కుటుంబంలో బంధువులందరూ కలిసి 200 మందికిపైగా ఉంటారు.
అందులో ఎక్కువగా మధ్యతరగతికి చెందినవారే. ఏవైనా పండుగలు, వేడుకల వంటి సందర్భాల్లో వాళ్లందరినీ ఇంటికి ఆహ్వానిస్తాను. మంచి భోజనాలను ఆస్వాదిస్తూ అందరం కలిసి ఆనందంగా గడుపుతాం. దేవుడి దయ వల్ల వారందరిని సంతోషంగా ఉంచగలిగే అదృష్టం నాకు దక్కింది. కెరీర్ చివరలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కోసమే అంత పెద్ద ఇంటిని నిర్మించాను’ అని వడివేలు తెలిపారు. గత కొంతకాలంగా కెరీర్‌పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వడివేలు తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రభుదేవా ‘బ్యాంగ్ బ్యాంగ్’, ధనుష్ 56వ చిత్రాల్లో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

