Vaa Vaathiyaar | స్టార్ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సినిమాను డిసెంబర్ 05న తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో కార్తీ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కార్తీ సర్థార్ 2ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.
The Swag Master locks the date! 💥#VaaVaathiyaar storms into theatres on December 05, 2025🔥
A #NalanKumarasamy Entertainer
A @Music_Santhosh Musical #VaaVaathiyaarOnDec5@Karthi_Offl @VaaVaathiyaar #StudioGreen @gnanavelraja007 @IamKrithiShetty #Rajkiran #Sathyaraj… pic.twitter.com/qXI2wC1b92— Studio Green (@StudioGreen2) October 8, 2025