Sumalatha Devi | ఘనంగా TFTDDA నూతన అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారం.. తొలి మహిళా అధ్యక్షురాలిగా సుమలతా దేవి బాధ్యతల స్వీకరణ
TFTDDA | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి వి.వి. సుమలతా దేవి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
TFTDDA | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి వి.వి. సుమలతా దేవి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి అయిన సుమలతా దేవి, ఈ అసోసియేషన్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. “ఈ యూనియన్‌కు తొలిసారి ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం శుభపరిణామం. జానీ మాస్టర్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయనపై ఉన్న నమ్మకంతోనే సభ్యులు సుమలత గారిని ఎన్నుకున్నారు. సినీ కార్మికులకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సుమలతా దేవి మాట్లాడుతూ.. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. యూనియన్‌లోని ప్రతి చిన్న సమస్యను గుర్తించి, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ .. “ఎన్నికల్లో గెలిచిన సుమలతా దేవి గారికి కంగ్రాట్స్. యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘శ్రీశైలం యాదవ్ గారే ఈ సంస్థకు మొదటగా డబ్బులు ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండేవారు. ఆయన కుమారుడు నవీన్ చాలా గొప్ప వ్యక్తి. శ్రీశైలం గారి సతీమణి ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు, డ్యాన్సర్లకు ఆర్థిక సహాయం అందించేవారు. జానీని ఎంతో మంది కిందకు లాగాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. సుమలత విజయం ఈ యూనియన్‌కు మంచి రోజుల్ని తీసుకు వస్తుంది. మా తరపున కూడా ఈ యూనియన్‌కు అన్ని రకాల సహాయ సహకారాల్ని అందిస్తాం’ అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ .. ‘మా మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన బాడీ సహకారంతో యూనియన్ సంక్షేమం కోసం పాటు పడతాం. యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ విషయాన్ని రామ్ చరణ్ గారికి చెప్పిన వెంటనే ఆయన ఆర్థిక సాయం అందించారు. యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ స్థలం వచ్చేలా చూస్తామని చెప్పిన శ్రీశైలం యాదవ్ గారికి, నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు. మన యూనియన్ నుంచి ఓ సభ్యుడు రిటైర్ వెళ్తే.. ఆ వెళ్లే సమయంలో దాదాపు పది నుంచి పదిహేను లక్షలు ఇచ్చేలా ప్రణాళిక చేయాలని నా కోరిక. ఆ కోరిక నెరవేరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
TFTDDA నూతన కార్యవర్గం:
ప్రమాణ స్వీకారం చేసిన ఇతర ముఖ్య సభ్యులు:
ప్రధాన కార్యదర్శి: కె. శ్రీనివాసరావు
కోశాధికారి: పి. చిరంజీవి కుమార్
ఉపాధ్యక్షులు: కె. సురేష్, యమ్. రాజు
సహ కార్యదర్శులు: కే. కిరణ్ కుమార్, ఏ. రాము
కార్య నిర్వహక కార్యదర్శి: యు. శివ కృష్ణ
వీరితో పాటు 9 మంది కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

