Mahavatar Narsimha | హిందూ మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘మహావతార్ నరసింహ'(Mahavatar narsimha) కన్నడ టాప్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.
‘మహావతార్ నరసింహ’ సినిమా తెరకెక్కించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను కాపాడటానికి చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నం అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.
హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటిది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు.