Pawan Kalyan | పదేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. నాలుగేళ్లుగా ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఏకంగా ధమ్ బిర్యానీయే పెట్టింది. ఒక ఫ్యాన్స్ డైరెక్టర్ అయితే.. తన అభిమాన హీరోను తెరపై ఎలా చూపిస్తాడో అనే దానికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే పవన్ అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనే ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఏడాది కిందట ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ బైక్‌పై కళ్యాణ్ ఉన్న ఫోటోను రిలీజ్ చేసి వీళ్ల కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
అయితే కొన్ని నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఉలుకూ, పలుకూ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనే క్లారిటీ కూడా లేదు. దాంతో సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. ఇక గతేడాది చివరి నెలలో పేరు మార్చి మళ్లీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి వీళ్ల కాంబో కాన్సిల్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక మే 11న పవన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. కాగా తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లోని సంధ్య 70ఎమ్ఎమ్లో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే కేవలం ఒక్క థియేటర్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ స్క్రీనింగ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
Get ready for the power packed frenzy on the special day 🔥#UstaadBhagatSingh First Glimpse MASSive Launch at SANDHYA 35MM, Hyderabad on May 11th at 4.59 PM💥#UBSMassGlimpse 🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth pic.twitter.com/S9OqQSWnMf
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2023