RAPO 23 | మెగాఫోన్ పట్టిన ‘ఉస్తాద్’: దర్శకుడిగా మారుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్!
RamPothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమానులకు అదిరిపోయే బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన నటనతో, డ్యాన్స్‌తో వెండితెరపై మ్యాజిక్ చేసిన రామ్, ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారబోతున్నారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అభిమానులకు అదిరిపోయే బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన నటనతో, డ్యాన్స్‌తో వెండితెరపై మ్యాజిక్ చేసిన రామ్, ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారబోతున్నారు. తన 23వ చిత్రం (RAPO23) ద్వారా రామ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఒక ఉత్కంఠభరితమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రామ్ తన దర్శకత్వ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘వీర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ (The Story of a Lone Wolf) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ చూస్తుంటే, రామ్ ఒక ఇంటెన్స్ రోల్లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ సినిమా కోసం రామ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘స్రవంతి మూవీస్’ ఉండగానే, ప్రత్యేకంగా ‘రాపో సినిమాటిక్స్’ (RAPO Cinematics) అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. తన కలల ప్రాజెక్ట్‌ను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దర్శకుడిగా తన నిర్ణయం గురించి రామ్ స్పందిస్తూ.. “ఇన్నాళ్లు వాళ్ల కథల్లో నా ముఖం చూశారు.. ఈ కథలో నా గొంతు వింటారు” అంటూ పవర్ ఫుల్ కోట్‌ను షేర్ చేశారు. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు రామ్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు ఈ మాటలు చెబుతున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ #RAPO23 చిత్రం 2026 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
An exciting journey begins with all your love & blessings. 🖤
Introducing “𝙑𝙀𝙀𝙍𝘼” in #RAPO23 🔥
-the story of a Lone Wolf. 🐺Genre: Psychological Action Thriller.
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.December 2026… pic.twitter.com/m9dkC0XMb7
— RAm POthineni (@ramsayz) May 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

