Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా అన్ని పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు నుంచే బిజినెస్ పరంగా బలమైన డీల్‌లు కుదుర్చుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా ఓటీటీ పరంగానూ బిగ్ అప్డేట్ను అందుకుంది.
థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమాను ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తాజాగా పండుగ సీజన్ సందర్భంగా తెలుగు సినిమాల జాబితాను ప్రకటించగా, ఆ లిస్ట్‌లో మొదటి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా పండుగ లాంటి వార్తగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా పవన్ మాస్ ఇమేజ్ మరింత విస్తరించనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ ట్రీట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.మొత్తంగా చూస్తే, థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్… రిలీజ్ అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అలరించనుందని స్పష్టమవుతోంది. పవర్ స్టార్ మాస్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా షేక్ చేయనుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.