పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ‘ఆయుధ పూజ’ పేరుతో కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ చేతిలో భారీ సుత్తిని పట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. తాజా షెడ్యూల్లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
‘మాస్‌పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను వినూత్న రీతిలో ప్రజెంట్ చేయబోతున్నాడు. పోలీస్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: హరీష్‌శంకర్.