Urvashi Rautela | ఫోన్ ఆచూకీ తెలుసుకున్న ఊర్వశి.. తిరిగిచ్చేందుకు కండిషన్ పెట్టిన అజ్ఞాత వ్యక్తి
Urvashi Rautela | ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) తన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫోన్ ఆచూకీ నటికి తెలిసింది. బంగారు ఐఫోన్ తన వద్ద ఉందంటూ ఓ వ్యక్తి ఊర్వశికి మెయిల్ చేశాడు. అయితే, దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ కండిషన్ పెట్టాడు.
Urvashi Rautela | ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) తన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో శనివారం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్‌లో ఆమె తన 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ (24 Carat Real Gold iPhone) పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. తాజాగా ఆ ఫోన్ ఆచూకీ నటికి తెలిసింది.
బంగారు ఐఫోన్ తన వద్ద ఉందంటూ ఓ వ్యక్తి ఊర్వశికి మెయిల్ చేశాడు. అయితే, దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ కండిషన్ పెట్టాడు. ‘మీ ఫోన్ నా దగ్గర ఉంది. మీకు ఇవ్వాలంటే నాకు ఓ సాయం చేయాలి. నా సోదరుడు క్యాన్స్‌ర్‌తో బాధపడుతున్నాడు. అతడిని క్యాన్సర్ బారి నుంచి రక్షించేందుకు సాయం చేయాలి’ అంటూ మెయిల్ చేశాడు. దీనికి స్పందించిన ఊర్వశి ఓకే (థమ్స్ అప్ సింబల్) అంటూ రిప్లే ఇచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఊర్వశి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. దాన్ని బట్టి ఆ మెయిల్ ఈ నెల 16వ తేదీన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మెయిల్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను మాత్రం నటి వెల్లడించలేదు.
మరోవైపు ఫోన్ పోగొట్టుకున్న ఊర్వశి దాన్ని తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన వారికి రివార్డు కూడా ప్రకటించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఫోన్ చివరి సారిగా అహ్మదాబాద్‌లోని ఓ మాల్ వద్ద ఉన్నట్లు తెలిపింది. ఫోన్‌ను తిరిగి తెచ్చిస్తే రివార్డు ఇస్తానంటూ ప్రకటించింది. అయితే ఆ రివార్డు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.
Also Read..
Jr NTR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ కమిటీ సభ్యుడిగా ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన అకాడమీ
Leo | లియో సందడి.. థియేటర్లో రింగ్స్ మార్చుకున్న కాబోయే కొత్త జంట
Manchu Lakshmi | స్వలింగ వివాహాలకు సుప్రీం నో.. గుండె పగిలిందన్న మంచు లక్ష్మి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

