Urvashi Rautela | ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) తన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో శనివారం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్‌లో ఆమె తన 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ (24 Carat Real Gold iPhone) పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. అయితే, ఫోన్ పోయి మూడు రోజులైనా ఇప్పటికీ ఆ ఫోన్ జాడ తెలియరాలేదు. దాని కోసం ఇంకా తన వెతుకులాటను కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఫోన్ కనుగొనడంలో సాయం చేసిన వారికి రివార్డ్ (Offers Reward) ప్రకటించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఫోన్ చివరి సారిగా అహ్మదాబాద్‌లోని ఓ మాల్ వద్ద ఉన్నట్లు తెలిపింది. ఫోన్‌ను తిరిగి తెచ్చిస్తే రివార్డు ఇస్తానంటూ ప్రకటించింది. అయితే ఆ రివార్డు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.
📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023
Also Read..
Alia Bhatt | నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం.. పెళ్లి చీరలో మెరిసిన అలియా
Samantha | 14 నెలల తర్వాత.. తనకు ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత