kabzaa sequel on cards | ‘కేజీఎఫ్’ను అటు ఇటు తిప్పి 144p రెజల్యూషన్‌లో చూసినట్టుందన్న కామెంట్స్ వినిపించిన ‘కబ్జ’కు సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. గతనెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఎంతలా అంటే పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. తీరా థియేటర్లకు వెళ్లి చూస్తే రొటీన్ రొట్ట స్టోరీ అని తెలిసి సగం జనాలు ఇంటర్వల్‌కు ముందే వెళ్లిపోయారు. వారంలోపే సినిమా దుకాణం సర్దేసింది. ఇక నెల తిరక్కుండానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
పోని కన్నడలో రికార్డులు కొల్లగొట్టిందా అంటే అదీ లేదు. మూడు రోజుల్లోనే వంద కోట్లు అంటూ పోస్టర్ వేయించి ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యారు. ఇంత జరిగినా దర్శక, నిర్మాతలు తగ్గేదేలే అంటున్నారు. కబ్జ-2ను స్టార్ట్ చేస్తున్నట్లు ఏకంగా పోస్టర్‌నే రిలీజ్ చేశారు. మొదటి పార్టులో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించగా.. సుదీప్, శివరాజ్ కుమార్‌లు కీలకపాత్రలో కొద్ది సేపు మెరిసారు. అయితే సెకండ్ పార్ట్‌లో మాత్రం శివరాజ్ కుమార్ హైలెట్ అయ్యేలా తెరకెక్కిస్తారట. మరీ ఈ సీక్వెల్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటారా? లేదంటే కన్నడలోనే రిలీజ్ చేసి సేఫ్ అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారంటే.. ఈ సారి సెకండ్ పార్ట్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Get ready for #Kabzaa2 😎 pic.twitter.com/Vo2G57YTFE
— LetsCinema (@letscinema) April 14, 2023