OTT MOVIES | ప్రతి వారం ప్రేక్షకులకి వినోదం పంచేందుకు వెరైటీ సినిమాలు ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీలో సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే థియేటర్స్‌లో ఎలాంటి సినిమాలు వచ్చిన కూడా ఓటీటీలో మాత్రం వెరైటీ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చి ప్రేక్షకులకి కనువిందు చేస్తాయి. ఏప్రిల్ రెండో వారంలో కూడా థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి.సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి నటించిన ‘జాక్’, యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు థియేటర్స్‌లో విడుదల కానుండగా, వాటిపై అందరి దృష్టి ఉంది.
ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు సైతం రిలీజ్ కాబోతున్నాయి.కోలీవుడ్ నటుడు అజిత్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ చిత్రాలు తెలుగులో కూడా సందడి చేయనున్నాయి.నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. కోర్టు – సినిమా – తెలుగు – ఏప్రిల్ 11 ,పెరుసు – సినిమా – తెలుగు – ఏప్రిల్ 11 ,ఫ్రోజెన్ హాట్ బాయ్స్ – సినిమా – ఇంగ్లిష్ – ఏప్రిల్ 10, కిల్ టోనీ – వెబ్ సిరీస్ – ఇంగ్లిష్ – ఏప్రిల్ 7 ,బ్లాక్ మిర్రర్ 7 – వెబ్ సిరీస్ – ఇంగ్లిష్ – ఏప్రిల్ 10 ,అమెజాన్ ప్రైమ్.. ఛోరీ 2 – సినిమా – హిందీ – ఏప్రిల్ 11, జియో హాట్ స్టార్.. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 – యానిమేషన్ సిరీస్ – హిందీ – ఏప్రిల్ 11 ,ఈటీవీ విన్.. టుక్ టుక్ – సినిమా – తెలుగు – ఏప్రిల్ 10 న స్ట్రీమ్ కానున్నాయి.
సోనీలివ్ లో ప్రావింకూడు షాపు: ఏప్రిల్ 11 (తెలుగులోనూ) చిత్రం స్ట్రీమ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే థియేటర్స్‌లో జాక్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పాటు కౌసల్య తనయ రాఘవ,గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కూడా స్ట్రీమ్ కానుంది. రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా స్వామి పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘కౌసల్య తనయ రాఘవ’ రాముడు, రావణుడు కాన్సెప్ట్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.ఇక అజిత్ – త్రిష జోడీ మరోసారి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. యాక్షన్ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీలో అజిత్ తన లుక్స్‌తో పాటు అందంతో అలరించనున్నాడు.