Trisha | చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ వయస్సులోను త్రిష కుర్రహీరోలకి పోటీ ఇస్తుంది. ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. నాలుగు పదుల వయస్సులోను త్రిష ఈ జోరు చూపిస్తుందంటే మాములు విషయం కాదు. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది త్రిష. ఇప్పుడు తెలుగులో చిరంజీవి సరసన నటిస్తుంది. విశ్వంభర చిత్రంతో త్రిష టాలీవుడ్‌కి కమ్ బ్యాక్ ఇస్తుంది. ఈ మూవీ హిట్ అయితే త్రిషకి తెలుగులో మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే త్రిష సినిమాలు పక్కన పెడితే ప్రేమాయణాలు లెక్కలేనేంత మందితో నడిపిందని కోలీవుడ్ వర్గాలు కోడై కూసాయి.
శింబు నుంచి ధనుష్ వరకు అమ్మడు నడిపిన ప్రేమాయణాలు గురించి కథలు కథలుగా చెప్పుకొస్తారు . ఈ రోజు (మే 4న) త్రిష పుట్టినరోజు కాగా, ఆమెకి సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం త్రిష వయసు 42 సంవత్సరాలు. బర్త్ డే సందర్భంగా ఆమె పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. త్రిష వరుణ్ అనే వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరుపుకుంది. 2015 జనవరి 23న ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దర ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్లి తరువాయి అనుకుంటున్న సమయంలో వీరిద్దరి బంధం మేలో ముగిసింది. ఇప్పటి వరకు వారి రిలేషన్ పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదు అనే దానిపై క్లారిటీ లేదు.
కాకపోతే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు పలు తెరపైకి వచ్చాయి. వరుణ్ కుటుంబానికి వ్యాపార నేపథ్యం ఉంది కాబట్టి వారు బిజినెస్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అమ్మాయిని వారు కొరుకున్నారట. త్రిష సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, అందులో సినిమాలతో బిజీగా ఉండడం వలన వారికి నచ్చక పెళ్లికి నో చెప్పినట్టు టాక్ నడిచింది. ఇంక పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని త్రిషని అడిగితే నిజం చెప్పాలంటే నాకు వివాహంపై నమ్మకం లేదు. పెళ్లి జరిగినా ఓకే.. జరక్కపోయినా నాకు బాధేమీ ఉండదు. కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటా. ఇది మాత్రం పక్కా అని త్రిష పేర్కొంది.