విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే నేపథ్యంతో స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ సినిమాను జూన్ 9న విడుదల చేస్తున్నట్లు ఆర్. నారాయణమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందించాలని చెబుతూ ఈ చిత్రాన్ని రూపొందించాను. ఫీజుల విషయంలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారి భవిష్యత్తో ఆటలు ఆడుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి పోయి విద్యారంగం బాగుపడాలి. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన మా యూనివర్సిటీ సినిమా విద్యార్థులతో పాటు నేటి యువతను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.’ అన్నారు.