Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్(Anupama) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindhapuri). ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి (Koushik Pegallapati ) దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి(Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఉండిపోవే నాతోనే (Undipove Naathone) అంటూ సాగే ఈ పాటను జావేద్ అలీ పాడగా.. పూర్ణ చారి లిరిక్స్ అందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.