Maamannam Movie | మూడు రోజుల కిందట రిలీజైన మామన్నమ్ తమిళనాట సంచలనం రేపుతుంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తుండటంతో కలెక్షన్ల సంఖ్య పెరుగుతుంది. టిక్కెట్లు కూడా భారీ సంఖ్యలో తెగుతున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. మాములుగానే మారి సినిమాలకు తమిళంలో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సమాజంలో కింది స్థాయి వాళ్లను ఎలా చూస్తారు. సమాజంలో వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉంది అనే కాన్సెప్ట్‌తో పరియారుమ్ పెరుమాల్, కర్ణన్ సినిమాలు తెరకెక్కించి తమిళనాట సంచలనం అయ్యాడు. ఈ సారి దానికి పొలిటికల్ ఫ్లేవర్ దట్టించి మామన్నమ్ తెరకెక్కించాడు.
రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నిర్మాత, హీరో ఉదయనిధి స్టాలిన్.. మారి సెల్వరాజ్‌కు లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. 60లక్షలు విలువ చేసే మిని కూపర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ మేరకు మారి సెల్వరాజ్‌కు కారు బహుకరిస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరో ఏడెనిమిది కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తవుతుంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఫాహద్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. వడివేలు కీలకపాత్రలో మెరిసాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
மாமன்னன் கதை எந்த புள்ளியில் தொடங்கியதோ சரியாக அந்த புள்ளியில் நின்று ஒட்டுமொத்த மானுட சமூகத்தின் கரம் பற்றி பெரும் நெகழ்ச்சியோடு சொல்கிறேன் அத்தனைக்கும் நன்றியும் ப்ரியமும் @Udhaystalin சார் ❤️❤️❤️@RedGiantMovies_ ❤️❤️ @arrahman @KeerthyOfficial #fhadh #Vadivel #Maamanan 🤴 https://t.co/F4kE7TGDNf
— Mari Selvaraj (@mari_selvaraj) July 2, 2023