ఉదయ్ కిరణ్ చివరి సినిమాను ఓటీటీలో చూడాల్సిందేనా..!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చనిపోయి కూడా ఏడేళ్లు పూర్తి అయిపోయింది. అయినా కూడా ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు గుర్తుచేసుకొని అభిమానులు బాధపడుతూనే ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకు వచ్చిన ఉదయ్.. పాపం అంతే వేగంగా వెనుకబడి పోయాడు. హ్యాట్రిక్ విజయాల తర్వాత సరైన గైడెన్స్ లేక ఈయన కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఆ తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన ఉదయ్ కిరణ్ జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పటి నుంచి చనిపోయే వరకు ఈయన కెరీర్ డైలమాలోనే ఉంది.
ఇదిలా ఉంటే ఈయన చివరి సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దాని పేరు చిత్రం చెప్పిన కథ. ఈ సినిమా రిలీజ్ తర్వాత తన కెరీర్ గాడిన పడుతుంది అని అప్పట్లో ఉదయ్ కిరణ్ కొంతమందితో చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అనుకోని కారణాలతో అప్పట్లో వాయిదా పడింది. ఉదయ్ చనిపోయిన తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమాను ఇప్పుడు డిజిటల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. నిజానికి 2020 ఫస్ట్ వేవ్ లో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ రేటు వర్కౌట్ అవ్వకో ఇంకా ఏదైనా కారణాల వలనో డీల్ సెట్ కాలేదు.
కానీ ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ లో చాలా సినిమాలు డిజిటల్ లోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ కూడా ఎలాగైనా డిజిటల్ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి కష్టంగా అభిమానులు కూడా చూస్తారని నమ్ముతున్నాయి ఓటిటీ సంస్థలు. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

