Uday Bhanu | త్వరలో నాకు జరిగిన అన్యాయాలని బహిర్గతం చేస్తా.. పెద్ద యుద్ధాలు జరుగుతాయంటూ ఉదయభాను కామెంట్స్
Uday Bhanu | తెలుగమ్మాయి అయిన ఉదయభాను సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ఈ యాంకర్ ఇటీవల త్రిబాణధారి బార్భరిక్ సినిమాపై ప్రమోషన్స్ లో పాల్గొని ఇండస్ట్రీలో యాంకర్లకు ఎదురవుతున్న అసమానతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Uday Bhanu | తెలుగమ్మాయి అయిన ఉదయభాను సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ఈ యాంకర్ ఇటీవల త్రిబాణధారి బార్భరిక్ సినిమాపై ప్రమోషన్స్ లో పాల్గొని ఇండస్ట్రీలో యాంకర్లకు ఎదురవుతున్న అసమానతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల “ఓ భామ అయ్యో రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఇండస్ట్రీలో కొన్ని గ్రూపులు యాంకరింగ్‌ను సిండికేట్‌లా మార్చేశారని ఉదయభాను వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలపై నానా రకాల విమర్శలు వచ్చాయి.
కొందరు ఆమెకి అవకాశాలు లేక అలా అన్నారని, మరికొందరు వార్తలలో నిలవడం కోసం అలా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. తాజాగా దానిపై క్లారిటీ ఇస్తూ.. “ఆ రోజు నేను జోక్‌గా అన్నా కూడా అది అబద్ధం కాదు. ఈ రంగంలో నాకు ఎదురైన అనుభవాలే నన్ను అలా మాట్లాడేలా చేశాయి. ఎన్నో సార్లు ఈవెంట్‌కు రెడీ అయ్యి వెళ్లాక, ఆ ఛాన్స్ వేరొకరికి వెళ్లిందని తెలిసి వెనక్కి వచ్చాను. కొన్ని ఛానల్స్ నన్ను అడిగి డేట్స్ తీసుకున్నారు, తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశారు. తనపై “హైయెస్ట్ పెయిడ్ యాంకర్” అనే ట్యాగ్ వేసినప్పటికీ వాస్తవ పరిస్థితి వేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటికొచ్చి చూస్తే, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయో తెలుస్తుంది. ఇది షో ఆఫ్ కాదు, నిజం. తను ఎప్పుడూ సెలెక్టివ్ గా ఉన్నానని, చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనతో పాటు ఉన్న చిన్న యాంకర్ల భవిష్యత్తును దెబ్బతీయడం అవుతుందని, అందుకే అవి ఒప్పుకునే దానిని కాదని ఉదయ భాను పేర్కొంది. ఇండస్ట్రీలో తనపై జరిగిన అన్యాయాలన్నీ త్వరలో బహిరంగంగా చెబుతాను అని ఉదయభాను వెల్లడించారు. ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి. కానీ నేను మాట్లాడేది ఎవరిని తక్కువ చేయడం కోసం కాదు. వచ్చే తరం కొద్దిపాటి అవగాహన కోసం. తన అభిప్రాయాల్లో ఉండే తాత్వికత (ఫిలాసఫీ) తన చదువుల్లో మాత్రమే కాకుండా, కెరీర్ నేర్పిన జీవిత పాఠాల వలన ఏర్పడిందని చెప్పారు. అందుకే ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

