Naa Saamiranga Movie | ఎట్టకేలకు నాగ్ కొత్త సినిమా కబురు అందింది. అక్కినేని అభిమానుల సుధీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ నా సామిరంగా అంటూ ఇటీవలే కొత్త సినిమాను ప్రకటించాడు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన విజయ్ బన్నీతో నాగ్ తన కొత్త సినిమా చేస్తున్నాడు. నాగ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన మాస్ టీజర్ అక్కినేని ఫ్యాన్స్‌కు అసలు సిసలైన ధమ్ బిర్యానిలా అనిపించింది. ఇన్నాళ్లు మన్మధుడిగా పేరున్న నాగార్జునను ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దింపేశాడు దర్శకుడు బిన్నీ. కథను పెద్దగా రివీల్ చేయలేదు కానీ సినిమా మాత్రం ఓ రేంజ్లో ఉండబోతుందని టీజర్‌తో ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు భామలు కనిపించబోతున్నారట. అందులో కన్నడ ముద్దుగుమ్మ అశికా రంగనాథ్ ఒకరు. ఎన్నో రాత్రులోస్తాయి గానీ అంటూ అమిగోస్లో కళ్యాణ్‌రామ్‌తో ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మనే. వన్నె తరగని అందంతో.. క్యూట్ నటనతో సినీ లవర్స్‌ను ఆకట్టుకున్నా.. ఈ బ్యూటీకి తెలుగులో సరైన డెబ్యూ దక్కలేదు. అమిగోస్ ఫలితం దెబ్బ కొట్టడంతో ఈ బ్యూటీ పేరు జనాలకు అంతగా రిజస్టర్ కాలేదు. తెలుగులో సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తుండగా నాగ్‌తో జోడీ కుదరింది.
మరో భామ మిర్న మీనన్. పేరు చెబితే తొందరగా స్ట్రయిక్ కాదు కానీ.. జైలర్ కోడలు అంటే ఇట్టే పట్టేస్తారు. ఇక ఈ భామ కూడా ఇందులో నటించనుందట. ఇక నాగ్ ఇప్పటికి వరకు ఇద్దరు హీరోయిన్లతో చేసిన సినిమాలన్ని దాదాపుగా హిట్లే. ఆ లిస్ట్‌లోకి ఇది కూడా చేరుతుందో లేదు చూడాలి. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి కాస్టింగ్ కూడా తోడవడంతో ఈ సినిమాపై జానల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొత్తంగా మంచి కాస్ట్ అండ్ క్రూతో నాగార్జున మాస్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను లోకల్, ధమాకా వంటి సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించాడు. ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత్ ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నాడు.