Vijay | తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈరోజు కీలక మలుపు తిరగనుంది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది. విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు దేశ రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కార్యక్రమానికి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం.
అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం నటి త్రిష. ఇప్పటికే విజయ్-త్రిష సంబంధంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె ప్రమాణ స్వీకార వేడుకకు హాజరుకావడం మరింత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం త్రిష స్టేడియానికి చేరుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ పలు రకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత కుటుంబ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరైన ఫోటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. అదే సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.
ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది. మరో నటితో విజయ్ సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోర్టు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారంలో త్రిష పేరు కూడా తరచూ వినిపిస్తుండటంతో, ఇప్పుడు ఆమె ప్రమాణ స్వీకార వేడుకకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గతంలో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ, తర్వాత పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్-త్రిష వ్యవహారం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాలపై ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.