Trisha | కోలీవుడ్‌లో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకున్న నటి త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్న ఆమె.. ఈ సినిమా కారణంగా కాకుండా తన సినీ కెరీర్‌కు సంబంధించి వినిపిస్తున్న వార్తలతో హాట్ టాపిక్‌గా మారారు. త్రిష నటిస్తున్న ఈ సినిమా ఆమెకు చివరి చిత్రం కాబోతుందా? ఇక సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అనే చర్చలు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
త్రిష ప్రస్తుతం లండన్‌లో ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్లో ‘ఎయిర్‌లిఫ్ట్’, ‘చెఫ్’, ‘పిప్పా’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ సంస్థ.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో త్రిషతో పాటు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, నేషనల్ అవార్డు విజేత అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు ప్రతిభావంతమైన నటీమణులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి త్రిషకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత త్రిష సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచనలో ఆమె ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో లండన్‌లో జరుగుతున్న ఈ సినిమా త్రిష కెరీర్లో చివరి చిత్రంగా మిగిలిపోతుందా? అనే చర్చ మొదలైంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు, ఊహాగానాలు మాత్రమే. త్రిష నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. త్రిషకు తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఉన్నరిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలకు కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. తెరపై వీరి కెమిస్ట్రీకి కూడా భారీగా అభిమానులు ఉన్నారు. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో.. ఇప్పుడు త్రిష కూడా పాలిటిక్స్‌లోకి వస్తారనే ప్రచారం రావడం ఆసక్తిని పెంచుతోంది.