Trisha | చెన్నై చంద్రం త్రిష ఇప్పటికి సింగిల్‌గానే ఉంది. ఆమె తోటి హీరోయిన్స్ అందరు పెళ్లి పీటలు ఎక్కుతుండగా, త్రిష మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా హింట్ ఇస్తుంది. సినిమాలు తప్పితే ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోని త్రిష గురించి అప్పుడప్పుడు అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆమె పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు అభిమానులకి అనేక అనుమానాలు కలిగిస్తూ ఉంటాయి. త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఆకుపచ్చ రంగు చీర ధరించి, శారీ కలర్ కు మ్యాచింగ్ గా మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి అచ్చం అతిలోక సుందరిలా కనిపించింది.ఇక ఆ ఫొటోకి ‘ ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
త్రిష పోస్ట్‌తో అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా, ఆమె తన అభిమానులకి ఏం చెప్పాలని అనుకుంటుంది. త్రిష పెళ్లికి సమయం ఆసన్నమైందా అని అభిమానులు రకరకాలుగా ముచ్చటించుకుంటున్నారు. ఇక తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లతోనే కాకుండా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. మొన్నామధ్య పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది.
ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా తర్వాత త్రిష మళ్లీ టాలీవుడ్లో బిజీ కానుందా అనే అభిప్రాయం అభిమానులలో కలుగుతుంది. 1999లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష దాదాపు 15 సంవత్సరాలపాటు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 70కిపైగా సినిమాల్లో నటించింది ఈ అందాల ముద్దుగుమ్మ. 26 సంవత్సరాలుగా తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న త్రిష చేస్తున్న పలు సినిమాలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు త్రిష వయస్సు 41 కాగా, ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమాలో త్రిష ఎలాంటి ఫిజిక్‌తో కనిపించిందో ఇప్పటికీ దాన్నే మెయిన్‌టెయిన్ చేస్తుంది.