త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లీ యేలూరి దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’. డా.వై.జగన్మోహన్, నాగార్జున అల్లం నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని, కామెడీతో పాటు ఇందులో సస్పెన్స్ ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేస్తాయని, త్రిగుణ్, మేఘా ప్రేమకథ లవ్లీగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీరాజ్, మధునందన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం: నాగార్జున అల్లం, మాటలు: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం, కెమెరా: వాసు, సంగీతం: ఆనంద్ మంత్ర.