త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘జంగా’. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకుడు. రమ్య కిలారి, జయచంద్రనాయుడు నిర్మాతలు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. సోమవారం త్రిగుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులోని విజువల్స్, సౌండింగ్, హీరో లుక్ కొత్తగా ఉన్నాయి.
త్రిగుణ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. శ్రావణ్, మధునందన్, గగన్ విహారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కృష్ణ సౌరభ్.