త్రిగున్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ సీహెచ్ దర్శకుడు. అరవింద్.ఎమ్ నిర్మాత. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే’ అనే పల్లవితో సాగే సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తోంది. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ చిలువేరు.