Tourist Family | తమిళంలో చిన్నా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకున్న చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ను అందుకుంది. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్, ధనుష్, ఎస్.ఎస్ రాజమౌళి, సూర్య, నాని సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీకి వచ్చాక ఇతర భాషా ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా రోజులకు ఒక మంచి సినిమాను చూశామంటూ కితాబిస్తున్నారు.
ఇదిలావుంటే ఈ సినిమా ఈవెంట్లో భాగంగా చాలా రోజుల కిందటా.. దర్శకుడు అభిషన్ జీవింత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిషన్ జీవింత్ ఈ వేడుకలో మాట్లాడుతూ.. చిత్రయూనిట్‌కి ధన్యవాదాలు చెప్పిన అనంతరం తన ప్రేయాసి అఖిలను నన్ను పెళ్లి చేసుకుంటావా అని స్టేజీపై నుంచే అడగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అఖిల నా జీవితంలో చిన్ననాటి నుంచి ఉంది. టెన్త్ తర్వాత మేమిద్దరం ఎక్కవ క్లోజ్ అయ్యాం.. నా ప్రతి అడుగులో తాను ఉంది. అందుకే తనకు థాంక్స్ చెప్పాలి. అలాగే అందరిముందు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంత కిక్ ఉంటుందో నీ దగ్గర ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉంటాను అంటూ అభిషన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అభిషన్ మాటాలకి అఖిల కూడా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wow !! So Cute & Heartwarming clip 🫶♥️#TouristFamily Director Abishan PROPOSES his girlfriend & asks to marriage at the pre release event💫pic.twitter.com/1UEW9fMlWF
— AmuthaBharathi (@CinemaWithAB) April 27, 2025