శ్రీలంక నుంచి తమిళనాడు రామేశ్వరానికి వలస వచ్చిన శరణార్ధి కుటుంబ కథాంశంతో రూపొందిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్-ప్రాఫిట్ రేషియోలో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రంగా నిలిచింది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. 7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 90కోట్ల వసూళ్లను సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి 1200 శాతం లాభాలను ఆర్జించింది. ఇటీవల కాలంలో ఇదొక అరుదైన రికార్డని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నది.