సోమవారం బిగ్ బాస్ ఎపిసోడ్ సగం సిరి వేరే గ్యాంగ్‌తో మాట్లాడడం వలన షణ్ముఖ్ ఎలా మారిపోతున్నాడో చూపించారు. సిరి దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఆమెకు గీతోపదేశం చేసాడు షణ్ముఖ్. మనిద్దర్నీ దూరం చేయాలని వాళ్ల ప్లాన్. నీ క్యారెక్టర్ వరస్ట్ అయినా పర్లేదు.. వాళ్లకి ప్రాబ్లమ్ లేదు.. అందుకే వాళ్ల హెల్ప్ తీసుకోవద్దని చెప్పాను.. నువ్ వినట్లేదు.. కాజల్ పాయింట్ ఏంటి అంటే.. సన్నీతో గొడవపెట్టుకున్నవాళ్లంతా వరుసగా వెళ్లిపోతున్నారు.. ప్రియ, రవి ఇలా చాలామంది. ఇప్పుడు నువ్వు.
సన్నీకి నీకు ట్రాక్ పెట్టడానికి చూస్తున్నారు.. ఇది నీకు చెప్తే కంట్రోల్లో పెడుతున్నావ్ అని అంటారు.. తొక్కలోది అంటూ అక్కడ నుంచి లేచి కోపంగా వెళ్లిపోతాడు షణ్ముఖ్. ఆయన ఎందుకు ఇంత బాధపడుతున్నాడో ఎవరికి అర్ధం కావడం లేదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు.
తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు అన్‌ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది. అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు.