రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..?
Rajamouli and Mahesh babu movie | మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఇంకా మొదలు కాకముందే చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
Rajamouli and Mahesh babu movie | మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఇంకా మొదలు కాకముందే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ కానీ.. మహేశ్ బాబు, రాజమౌళి కానీ స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ఈ మధ్యే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా తెరకెక్కబోతుందని ఆయన చెప్పాడు.
ఇప్పటి వరకు మహేశ్ బాబు, రాజమౌళి సినిమా సింగిల్ స్టారర్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ తరహాలో ఇది కూడా మల్టీస్టారర్ అని ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగులో కాదు తమిళం నుంచి ఒక స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే కచ్చితంగా మహేశ్ బాబుతో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో.. ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా మహేశ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ నిర్మాణ రంగం వైపు వస్తున్నాడు. రాజమౌళి దాదాపు పదేళ్ల కింద ఈయనతో సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది తెరపైకి రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో విలన్‌గా నటించడానికి యాక్షన్ హీరో గోపీచంద్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు రాజమౌళి. కెరీర్ మొదట్లో జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు గోపీచంద్. మధ్యలో పెద్ద అవకాశాలు వచ్చినా కూడా ప్రతినాయకుడిగా నటించలేదు. మరి ఇప్పుడు రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ఆయన తీసుకుంటాడో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
Unstoppable Finale Promo | నాదో చిన్న కోరిక..మహేశ్ బాబును అడిగిన బాలకృష్ణ..ప్రోమో అదిరింది”
“Sarkaru Vaaru Paata | సర్కారు వారి పాట షూట్ షురూ..మహేశ్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..?”
పదేండ్ల క్రితం మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు?”
“వామ్మో ఏకంగా పది మంది దర్శకులను లైన్లో పెట్టిన ఎన్టీఆర్…”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

