Ori Devuda Movie | విశ్వక్సేన్ సినిమాలో విక్టరీ వెంకటేష్..!
venkatesh cameo in vishwaksen ori devuda movie | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ థియేటర్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఎప్పుడూ సిరియస్ కథలను చేసే విశ్వక్.. ఈ సారి పూర్తి వినోదాత్మక చిత్రంతో వచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘ఓరి దేవుడా’ ఒకటి. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఒరిజినల్ వెర్షన్లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో నటించాడు. అయితే తెలుగులో ఎవరు నటిస్తారా? అనే ప్రశ్న అందిరి మదిలో ఉంది.
తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో దేవుడి పాత్రలో వెంకటేష్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా మూడు రోజుల్లోనే ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్ నటిస్తుంది. పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

