తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది సమంత (Samantha). ఈ చెన్నై సుందరి ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సామ్‌కు స్టార్ స్టేటస్ విషయంలో క్రేజ్ మాత్రం కావాల్సినంత ఉంది. కానీ రెమ్యునరేషన్ విషయానికొచ్చేసరికి కొంత వెనకబడిపోయిందనే అంటున్నారు సినీ జనాలు. ఈ భామ తెలుగు లేదా తమిళ సినిమాలకు కేవలం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ (remuneration) తీసుకుంటుందని టాక్ ఉంది.
అయితే ఇది మాత్రం మిగిలిన స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే మాత్రం తక్కువనే చెప్పాలి. లీడింగ్ స్టార్ హీరోయిన్లైన నయనతార (Nayanthara), పూజాహెగ్డే (Pooja Hegde)3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని ఇప్పటివరకు వచ్చిన కథనాల సారాంశం. కాగా సమంత ఇపుడు కొత్త టార్గెట్ పెట్టుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది..రెమ్యునరేషన్ విషయంలో పూజాహెగ్డేను మించి పోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఇపుడు సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఖుషీ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది సామ్. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్‌తో కూడా సినిమా చేస్తోంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్టయితే సామ్ కూడా పూజాహెగ్డే అంత డిమాండ్ చేయడం పక్కా అంటున్నారు మూవీ లవర్స్.
Read Also : Kamal Chiru | కమల్ హాసన్, చిరంజీవి అప్పుడు..ఇప్పుడు..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : Sai Dharam Tej | లైట్స్ అండ్ షాడోస్..సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..