సినీ నటుడు సోనూసూద్ ను ఇపుడు చాలా మంది దేవుడిలా పూజిస్తున్నారు. కోవిడ్ టైంలో ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే సోనూసూద్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ..ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ విషయాన్ని ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఐదేండ్ల క్రితం నేను ఓ ఛారిటీ ఈవెంట్ కు రావాలని సోనూసూద్ ను ఆహ్వానించాను.
అయితే ఈవెంట్ కు రావాలంటే సోనూసూద్ రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగాడు. దీంతో సోనూసూద్ కమర్షియల్ పర్సన్ అని అనుకున్నా. కానీ ఇపుడు చూస్తే వేలాది మందికి సాయం చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా ఉందనుకోవడం లేదు. గత ఏడాది నుంచి దేవుడిలా మారి ఆయన సేవలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలపడం అభినందనీయం. నేనిపుడు పూర్తిగా వేరే సోనూసూద్ ను చూస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!