Tollywood | ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి పెరిగింది. మంచి సినిమా తీసేందుకు నిర్మాతలు ఎంతో శ్రమిస్తున్నారు. అయితే సినిమా రిలీజై థియేటర్స్‌లోకి వచ్చి మంచి టాక్ సంపాదించుకున్నా కూడా కొందరు ఆ మూవీని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు వారిపై మీడియా ముఖంగా ఫైర్ అవుతున్నారు.. కొన్ని రోజుల క్రితం నాగవంశీ కొంతమంది మీడియా వాళ్ళు సినిమా బాగున్నా, హిట్ అయినా నెగిటివ్ గా రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతరం డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన సినిమాలకు ఎవరూ రావట్లేదు, థియేటర్స్ లో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్ లో విజయశాంతి.. కొంతమంది కావాలని సినిమాని నెగిటివ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి మానుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అసలు సినిమాలను ఎవరు నెగిటివ్ చేస్తున్నారు, సినిమాలు ఎందుకు అంత నష్టపోతున్నాయి అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే ఈ మధ్య కాలంలో చాలా మంది రివ్యూయర్స్ సినిమాని చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఒపీనియన్ మాదిరిగా కాకుండా అది ప్రేక్షకుల ఒపీనియన్ అని అంటున్నారు. వెబ్ సైట్స్ కంటే యూట్యూబ్ లోనే రీచ్ ఎక్కువ కాబట్టి ఇందులో రివ్యూలు చెప్పే వాళ్లు ఎక్కువయ్యారు. వారు చెప్పే రివ్యూలు సినిమాలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
ఇటీవల నాగవంశీ ఓ వెబ్ సైట్ పేరు చెప్పకుండా ఆ వెబ్ సైట్ ని విమర్శించారు. ఫ్యాన్స్ వార్స్ కూడా సినిమాలకు చాలా నెగిటివిటి తెస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు రిలీజ్ కి ముందు నుంచి ఓ ఇద్దరు హీరోల అభిమానులు సినిమాపై బాగా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. విచక్షణ జ్ఞానం లేకుండా ఇలా సినిమాలకు నెగిటివిటి చేస్తున్నారు. సినిమాలు సక్సెస్ అవ్వకపోవడానికి ఫ్యాన్ వార్స్ కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు.. హీరోలు బాగున్నా కూడా ఫ్యాన్స్ లేనిపోనివి ఊహించుకొని గొడవలు పడి సినిమాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరో కారణం సోషల్ మీడియా. చాలా మంది సినిమా చూస్తూనే సోషల్ మీడియాలో ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, ఇంటర్వెల్ అలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, క్లైమాక్స్ అలా.. అంటూ లైవ్ కామెంట్రీ ఇస్తుండడం కూడా సినిమాకి కాస్త మైనస్‌గా మారుతుంది . మరోవైపు ఓటీటీ వాళ్ళు సినిమా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. అయితే కథ బాగుంటే చిన్న సినిమాలని కూడా మనోళ్లు పెద్ద హిట్ చేశారు. అది కూడా సినీ ప్రముఖులు దృష్టిలో పెట్టుకోవల్సిన అవసరం ఎంతైన ఉంది .