Kadali Jaya Sarathi Passes away | టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయసారథి(80) కన్నుమూశాడు. గత కొద్ది రోజులగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జయసారథి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జయసారథి దాదాపు 372 సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
జయసారథి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో 1942 జూన్ 26న జన్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ‘వెలుగు నీడలు’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మనఊరి రామాయణం’, ‘బొబ్బిలి బ్రహ్మణ’, ‘డ్రైవర్ రాముడు’, ‘భక్త కన్నప్ప’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చివరగా సుమన్, రంభ హీరో హీరోయిన్లుగా నటించిన ‘హలో అల్లుడు’ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించాడు. ఇక జయసారథి అంత్యక్రియలు మధ్యాహ్నాం 2గంటలకు ‘మహా ప్రస్థానం’లో జరుగనున్నాయి.