టాలీవుడ్లో కొత్త సంచలనం శ్రీలీల. ఈ ముద్దుగుమ్మకు 2023 తెగ అచ్చొచ్చింది. 2019లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన, ఒప్పుకొన్న సినిమాల లిస్ట్ పెద్దదే. ‘భగవంత్‌సింగ్ కేసరి’లో సీనియర్ నటుడు బాలకృష్ణ పెంపుడు కూతురుగా పరిణతితో కూడిన నటన ప్రదర్శించింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో ఆమె ఖాతాలో భారీ విజయం నమోదైంది. వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన ‘ఆదికేశవ’లో హీరోయిన్గా కనిపించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవర్‌స్టార్ సరసన నటిస్తున్నది. త్రివిక్రమ్, మహేశ్‌బాబు కాంబోలో నిర్మితమవుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంలోనూ శ్రీలీలను కథానాయిక పాత్ర వరించింది.
మరో నాలుగైదు సినిమాల్లోనూ అవకాశాలు కొట్టేసింది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ చిత్రాల ఆఫర్లు కూడా వెల్లువలా వస్తున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లోనూ వారానికి ఇరవై గంటలు చదువుకు కేటాయిస్తున్నది. ఎంబీబీఎస్ చేస్తున్న శ్రీలీల యాక్టర్‌గా రాణిస్తూనే త్వరలోనే డాక్టర్ అనిపించుకోనుంది. మొత్తానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన శ్రీలీల ఆయన అంతకుముందు పరిచయం చేసిన కథానాయికల్లాగే సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటున్నది. వావ్-హైదరాబాద్ మ్యాగజైన్ 21 యంగ్ అచీవర్స్‌లో చోటు దక్కించుకుంది.