Sreeleela | బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. నటుడి తల్లి ఏమందంటే.!
Sreeleela | టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల.. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan)తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Sreeleela – Karthik Aaryan | టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల.. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan)తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల కలిసి ఒక సినిమాలో నటిస్తుండటంతో పాటు ఇటీవల కార్తీక్ కుటుంబంలో జరిగిన ఒక పార్టీలో శ్రీలీల హాజరవ్వడం ఈ అనుమానలకు దారితీసింది. అయితే తాజాగా కార్తిక్ అమ్మగారు చేసిన వ్యాఖ్యలు వలన వీరిద్దరు నిజంగానే డేటింగ్లో ఉన్నారా అనే డౌట్స్ బీటౌన్‌లో ప్రచారం జరుగుతుంది.
ఇటీవల ‘ఐఫా’ డిజిటల్ అవార్డ్స్ (IFFA) వేడుకలో పాల్గోన్న కార్తీక్ ఆర్యన్ అమ్మను నిర్మాత కరణ్ జోహార్ అడుగుతూ.. మీకు ఎలాంటి కోడలు రావాలనుందని అడుగుతాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒక మంచి డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలని అనుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించి చేసిందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం తెలిసిందే. గుంటూరు కారం షూటింగ్ సమయంలో కూడా సినిమా షూటింగ్‌తో పాటు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యింది ఈ భామ. అయితే శ్రీలీల డాక్టర్ కోర్స్ చదువుతుండడంతో తనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు కార్తిక్ అమ్మ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కార్తిక్ ఆర్యన్, శ్రీలీల జంటగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంగీత నేపథ్యంలో రాబోతున్న సినిమాతోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వం వహిస్తుండగా.. గుల్షన్ కుమార్ & టి-సిరీస్ ప్రెజెంటేషన్, ఎ టి-సిరీస్ ఫిల్మ్స్ & అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంగీత దిగ్గజం ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

